Type Here to Get Search Results !

ఇది క్రీస్తు దేహం ( idhi kristhu dheham Song Lyrics in Telugu | Telugu Christian song lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: ఇది క్రీస్తు దేహం - ఇది క్రీస్తు రక్తం

ఇది దైవ త్యాగం - ఇది ప్రేమ యాగం 

మానవతకు మహా ప్రసాదం - ముక్తినొసగు దివ్య వరం ||2|| 

అతి మధురం అపురూపం అజరామరం- అనుభవైక వేద్యం ||ఇది క్రీస్తు|| 


1. నరుడు ప్రభునిగ మారాలీ - 

ఈలోకమే స్వర్గమవ్వాలి

మృత్యువు చీడను ఛేదింప 

పాప పీడను తొలగింప

తండ్రి ఒసగినా ప్రేమ ప్రసాదం - 

తనయుడేసునీ దివ్య దేహం ||అతి మధురం|| 


2. ఆత్మ ఆకలి తీర్చుమా - 

నా జీవితం ధన్యమయ్యేను

హృదయ గాయము మాన్పుమా 

ఈ ఎండ మావి బ్రతుకులలో

తండ్రి ఒసగినా ప్రేమ ప్రసాదం - 

తనయుడేసుని దివ్య రక్తం ||అతి మధురం|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section