Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఇదియేమి అయ్యయ్యో ఈ రీతిగా బాధ
హింస చెందగ వలెనా.... నా యేసు ||ఇది||
1. పామర జనులకై భారమైన స్లీవ -
భారమందున క్రుంగెనా నా యేసు
శుచికారులై నట్టి సుందరాత్మకులు-
శృంగార వనము చేరిరే .. నా యేసువా ||ఇది||
2. రాజాధి రాయుడు రక్షకుడగు క్రీస్తు -
రక్తపు చెమట చేతను ... నా యేసు
ధర యందు కూలిన నరజన్మముల కొరకు -
నా దివ్య సుతుడప్పుడు నా యేసు ||ఇది||
3. అదరి బెదరిన మనస్కుల శరీర పురుషులు -
అదృశ్యులై వచ్చిరి..... నా యేసు
సర్వాంత జగమున సకల జనుల కొరకు -
సరిగ స్లీవలో ఘోర .... నా యేసు ||ఇది||