Type Here to Get Search Results !

ఇలలోన కలడు ( illalona kaladu Song Lyrics in Telugu | Telugu Christian song lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఇలలోన కలడు ఇలవేల్పు యొకడు

వాని మాత్రమే నెరనమ్ముకొందు


1 వ చరణం.. 


ఇహపరాల నెల్ల ఇంపుగ యొనరించే

కనిపించు కనరాని వస్తు సంతతిని

కలిగించె నతడు కడు నేర్పు గాను

సర్వేశ్వరుండు సర్వశక్తుండు


2 వ చరణం.. 


పితకు జన్మించే సుతుడొక్కరుండు

ఏకైక పుత్రుడు లోకా వనుడు

జగదేక నాధుడు జగన్నాయకుడగు

ఏసుక్రీస్తును నేను విశ్వసింతు


3 వ చరణం.. 


యుగయుగాలకు మునుపు

యుగ పురుషుడై పుట్టే

కాలకూటమి నంత తనకేల త్రిప్పే

దేవునకు జనియించె దేవుడై వెలసే

జ్యోతి నుండి ప్రభవించి జ్యోతియై వెలసే


4 వ చరణం.. 


మనుజులగు మన కొరకు మన రక్షణార్థమై

దివి నుండి భువికి దిగి వచ్చే నతడు

పవిత్రాత్ము ని ప్రమేయము వల్ల

కన్నయ్యగు మరియకు కొమరుడై జనియించె


5 వ చరణం.. 


పిలాతుడను వాని పరిపాలనము లోన

ఏ పాపమెరుగని ఏసుప్రభువు నంత

సిలువపై కొట్టి వధియించిరతని

సమాధి చేసిరతని సజ్జనులు కొందరు


6 వ చరణం.. 


వేద గ్రంథములోని వచనాల చొప్పున

మూడవ దినమున ముచ్చటగా లేచెన్

స్వర్గమున కెగ బ్రాకె స్వర్గ స్వామి యంత

పిత కుడి ప్రక్కన కూర్చుని యున్నారు


7 వ చరణం.. 


జగములోన మరి జీవించు జనులకు

మృత్యువాత పడిన మృత ప్రాణులకు

తీర్పు చేయవచ్చు మహిమతో మరల

అతని రాజ్యమునకు అంతమే లేదు


8 వ చరణం.. 


పిత సుతుల నుండి వేయించేయువాడు

లోకాల నెల్ల ఏలెడు వాడు

జీవ దాత యతడు పవిత్రాత్మ యనువాని

విశ్వసించు ను నేను విమల మతి తోడ

9 వ చరణం.. 


పిత సుతులతో సరిసమాన మహిమను

అర్చనారాధనలు అందుకొను చున్నాడు

ప్రవక్తల మూలమున ప్రబోధాలెన్నో

బోధించినాడు దైవ జనులకు


10 వ చరణం.. 


ఏక అపోస్తోలిక పవిత్ర కతోలిక

విశ్వ సమాజములను విశ్వసించెదను

పాపములు పోగొట్టు జ్ఞానస్నానము ను

అంగీకరింతును అంతమువరకు


11 వ చరణం.. 


మృతులందరు మరల లేతురను సత్యమును

మనసార నేను విశ్వసించెదను

రానున్న మరులోక అమర జీవమునకై

నిత్యము ఇలలోన నిరీక్షింతు నేను

ఆమెన్, ఆ..... మెన్, ఆ..... మెన్. 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section