Lyrics: Fr. Johnson Chettur
Tune: unknown
Music: K Ramachaari
Album: స్వర కమలం
హల్లెలూయ హల్లెలూయ ||2||
ప. ఇది క్రీస్తు సందేశం
నవ జీవన సంగీతం
ఎద వేదికపై మధుగీతికను
వినిపించు నవ వేదం ||2||
మానవ జనితకు మణిదీపం
హల్లెలూయ హల్లెలూయ ||2||
1. తరతరాలు అమానుషపు
సమస్యలను తొలగించే
మానవతా ఉషస్సులను
ఎద గుడిలో వెలిగించే ||2||
సుస్వర వేదం శ్రీ క్రీస్తు చరితం ||2|| ||హల్లె||
2. సమసమాజ సాధనకై
సత్కృతులను ప్రకటించి
అనురాగాల పరిమళాలు
ఎదఒడిలో వెదజల్లే
జీవన వేదం రసరమ్య భరితం ||2|| ||హల్లె||