Lyrics: Fr. Dusi Devaraj
Tune: Fr. D.V. Prasad
Music: Dattatreya
Album: జీవశృతి - 4
ఇది మా మందిరం
సుందర మందిరం
ఇదియే నందనం
దేవుని ఆలయం ||2||
1. నీ సన్నిధిలో నిలిచెదము
నీ వదనమునే దర్శింతుము ||2||
మా బ్రతుకులనే పీఠముగా
నీ పూజలకై మలిచెదము ||2||
నీ పూజలకై మలిచెదము ||ఇది మా||
2. ప్రార్థన చేతుము ఈ గుడిలో
వాక్యం విందుము ఈ స్థలిలో ||2||
జీవన బలిలో పాల్గొందము
మన ప్రభుయేసుని కొలిచెదము ||2||
మన ప్రభుయేసుని కొలిచెదము ||ఇది మా||
3. మా గృహములలో జీవించుము
మా హృదయాలను పాలించుము ||2||
నీ శుభవార్తకు సాక్షులుగా
ఇలలో నిలువగ దీవించుము ||2||
ఇలలో నిలువగ దీవించుము ||ఇది మా||