Lyrics:
Tune: Fr. Gnanam SDB
Music: Naveen M
Album: ప్రణతులు-2
ప: ఇది పూజా సమయం
మనకొసగిన అభయం
రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం ||2||
మన మనసుకు సేద తీర్చు సమయమిదే
రండీ పాల్గొందమూ
రండీ రక్షణ పొందుదమూ ||2||
రండీ రక్షణ పొందుదము ||ఇది||
1. పరిపూర్ణతతో ప్రభువొసగిన బలి
పరివర్తన కలుగుటకు
ప్రభువిచ్చిన ఈ బలి ||2||
ఈ బలియందే కలదు దైవబలం
ఇదియే మనకు జన్మఫలం
రండీ పాల్గొందమూ
రండీ రక్షణ పొందుదమూ ||2||
రండీ రక్షణ పొందుదము ||ఇది||
2. పసిడి వాక్కులో ప్రభవించిన బలి
ప్రతి నిత్యం వెలుగుటకు
ప్రభువిచ్చిన ఈ బలి ||2||
ఈ బలియందే కలదు ప్రేమ వరం
ఇదియే మనకు... జీవకరం
రండీ పాల్గొందమూ
రండీ రక్షణ పొందుదమూ ||2||
రండీ రక్షణ పొందుదము ||ఇది||