Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ఇది ...పరిణయం - ఇది అనురాగ
పరిమళం ఆ దేవుని ప్రేమకు ప్రతిరూపం
చూస్తున్నాము ఈ దినం ||ఇ||
1. ఇరువురి మనసులు పెనవేసి
అనురాగ జ్యోతులు వెలిగించి
ఆనంద డోలికల విహరించి
ఆ ప్రభుని ప్రేమలో విలసిల్లి
కావాలి మీ బ్రతుకు ఒక పూల బాట ||ఇ||
2. వివాహమన్నది ఒక వరము
అది దేవుడు చేసిన నిర్ణయము
ఈ బంధం ఏనాడు వీడనిది
కలకాలం మదిలోనే నిలిచెడిది
పలికెను ఈమాట అందరినోట ||ఇ||