Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ఇది శుభోదయం
క్రీస్తు జన్మదినం
ఇది లోక కళ్యాణం
మేరి పుణ్యదినం మేరి పుణ్యదినం
1. రాజులనేలే రారాజు వెలసెను
పశువుల పాకలో
పాపుల పాలిట రక్షకుడు
నవ్వెను తల్లి కౌగిలిలో
భయము లేదు మనకిలలో
జయము జయము జయమహా ||ఇ||
2. గొల్లలు జ్ఞానులు ఆనాడు
ప్రణమిల్లిరి భయభక్తితో
పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి
ప్రేమ గీతితో జయనాదమే ఈ భువిలో
ప్రతిధ్వనించెను ఆ దివిలో ||ఇ||