Type Here to Get Search Results !

ఇదిగో దేవా నా జీవితం ( idhigo Deva na jeevitham Song Lyrics in Telugu | Telugu Christian song lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: ఇదిగో దేవా నా జీవితం - ఆ పాద మస్తకం నీకంకితం 

శరణం... నీ చరణం... ||2|| 


1. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి

విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి 

అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు అందుకే గైకొనుమా దేవా 

ఈ నా శేష జీవితం ||2|| ||ఇదిగో|| 


2. నీ పాదముల చెంత చేరి - నీ చిత్తంబు నెనరుగ నేర్పు

నీ హృదయ భారంబు నొసగి - ప్రార్థించి పని చేయునిమ్ము ||2|| 

ఆగిపోక సాగిపోవు ప్రియ సుతునిగ పనిచేయ నిమ్ము

ప్రతిచోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండ నిమ్ము ||2|| ||ఇదిగో|| 


3. విస్తారపంట పొలమునుండి కష్టించి పనిచేయ నేర్పు

కన్నీటితో విత్తు మనస్సు కలకాలం మరి నాకు నొసగు

క్షేమ క్షామకాలమైన - నిన్ను ఘనపరచు బ్రతుకునమ్మయా 

నశియించు ఆత్మలనూ నీ దరిజేర్చు కృపనియ్యవా ||2|| ||ఇదిగో|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section