Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ఇదియే సమయం అర్చన సమయము
స్వీకరించు మా కానుకలు
గురుకములో ప్రేమతో అర్పింతు
పరమ పిత స్వీకరించు
1, గోధుమ అప్పను నీ వరము .
నీ కుమారుని శరీరముగా మార్చు
ద్రాక్ష రసములు నీ ఫలము
నీ కుమారుని రక్తముగ మార్చు
సకల జనావళి నీ సొంతం
బలి దానములు నీ కంకితం ||ఇ||
2. సకలము సృజియించిన దేవ
నీ కరుణను నేనిల వేడెదను
తలపులు మాటలు క్రియలు నీకై
ప్రేమతో నొసగిన కానుక యిదియే
తనువు మనస్సు అన్నియు నీకె
సహృదయంతో సమర్పింతు ||ఇ||