Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ఇదియే దేవుని ఆలయం
ఘనముగ పూజలు చేయుదము
ఇదియే భక్తుల ఆశ్రయము
గురువుంగవులకు స్వాగతము
1. నిజముగ నేడు దేవుడే మనతో వసించును
స్వయముగా తాను జీవనోద్దరణ వహించును
అన్ని బాధలను హరించును
పాత విషయములు గతించును
గళములు మేళవించి పాడరారే...
ప్రభోధగీతం llఇll
2. జగతికే జ్యోతి క్రీస్తు నీపైన జ్వలించును
ప్రజలు ఆకాంతి బాటలో నడచి తరింతురు
ఆత్మదీవెనలు లభించును
ఆదరణ కర్తపాలించును
గళములు మేళవించి పాడరారే...ప్రభోధగీతం llఇll