Lyrics: Rev. Fr. Alexander,
Tune: Koka Joseph Ranjith
Music: Koka Joseph Ranjith
Album: లోక రక్షకుడు
ప. ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా
నీ ప్రేమను నేను విడనాడితి ||2||
దేవా....దేవా....నా యేసయ్యా ||2|| ||ఇ||
1. ఈ లోక ఆశలలో పడితిని
అమరుని ప్రేమకు మరుగైతిని
పలుమార్లు మీ వాక్కు మదమెదిలిన
పరిహసించితి నిన్ను నా దైవమా ||ఇ||
2. ఎన్నాళ్ళునాకు ఈ వేదన
నినుగాంచలేని ఆవేదన
నాలోని తిమిరాన్ని తొలగించవా ||2||
నీ ప్రియదాసునిగ నను మలచవా ||2|| ||దే||