Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
పల్లవి:
జగమంత పొగడాలి ప్రియ తండ్రిని
జనమంత పాడలి ఘన దేవుని ll 2 ll
లోకాలు సృజియించే ఆ తండ్రియే
ప్రతి జీవి కాపాడు రారాజుయే ll 2 ll
1 వ చరణం..
ఆకాశ దేశాలు ప్రభవింపగ ,
విశ్వంభరాళము కీర్తింపగా ll 2 ll
ప్రతి కొండ ప్రతి లోయ , స్తూతియించగా
మానసార నిను నేను ధ్యానింతును ll 2 ll ll జగ ll
2 వ చరణం..
అందాల పుష్పాలు వికసింపగా
ధరయెల్ల ముదమార ప్రణమిల్లగా. ll 2 ll
ప్రతి ప్రాణి ప్రతి రోజు వినుతించగా
ప్రియమారా నిను నేను ప్రార్ధింతును ll 2 ll ll జగ ll