Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జనులు జైకొట్టుచూ బూరలు ఊదుచుండగా
ప్రభువు తన సింహాసనమును అధిరోహించును
1. నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు
జయ జయ నాదములతో - ప్రభువును కీర్తింపుడు
మహోన్నతుడైన ప్రభువు మహా భయంకరుడు
అతడు విశ్వధాత్రిని పాలించు మహారాజు
పాలించు మహారాజు... ||జనులు||
2. అతడు వన్యజాతులు లొంగినట్లు చేయును
వారిని మనకు పాదాక్రాంతులను చేయును
మనకు భుక్తమైయున్న ఈ దేశమంతటిని
ఇజ్రాయేలు ప్రజలు గర్వించునట్లు చేయును
గర్వించునట్లు చేయును... ||జనులు||