Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జీవజలం ప్రభు యేసుని మాట.......ఆ......
జీవనానికి అను పల్లవి పాట
ప్రతి మనసును గెలిచే మాట.......ఆ......
సరిబాట..... ప్రతి చోటా.......
ఆదిలో వినిపించె దేవుని నోట...llజీవll
లా లా లా.........
1 వ చరణం..
క్రీస్తుని వేదం సుమధుర నాధం
అనుదినము ప్రతి పలుకు నిత్య వసంతం ||2||
అలలా ఎగసి పరవశ మొందెను నా అంతరంగం ||2||
ఆత్మకెంతో హాయిని గూర్చు శ్రీ క్రీస్తు స్మరణం llజీవll
2 వ చరణం..
ఆత్మల నింపేధార జీవధారా........
అమరుడు యేసు ఒసగిన ధార అమృతధార ||2||
పాపిని మార్చి పాపము బాపెను ప్రేమ ధారా ||2||
మానవాళికి మోక్షపు మార్గం శ్రీ క్రీస్తు ద్వారా..... llజీవll