Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. జీవన సంగీతం
ప్రభు ప్రేమకు సంకేతం
పరిమళ జలపాతం
పరమాత్ముని ప్రతిరూపం
దివి వెలిగించే దీపము
దీవెనలొసగే ప్రభు వాక్యము
1. దేవుని మాటకు దూరము జరిగి
వలవల ఏడ్చిన వెతలెన్నో
దేవుని వాక్కును ఔదలదాల్చి
కిలకిల నవ్విన కధలెన్నో
పులకైన పరమును చూపే
తేజమే ప్రభు వాక్యము ||జీ||
2. మనిషికి తోడుగ మనిషుంటాడు
మనసుకు తోడు వాక్యమే
వాక్యపు సారము మనసు గ్రహిస్తే
జీవితమే నవ కావ్యమే
చీకటి దారుల వెన్నెల జల్లె
నిలిచేదే ప్రభు వాక్యము ||జీ||