Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P
Music: Naveen M
Album: యేసే నా ఆశ - 5
పల్లవి:
జుంటి తేనె తీపికన్నా గున్నమామిడి పండుకన్నా
పాలు పెరుగు వెన్నకన్నా మధురము నీ వాక్కు ||2||
నీ వాక్యమే నా జ్వోతియై... ||2||
నను నడిపించును నను నడిపించును నా ప్రాణయేసువా ||2||
1 వ చరణం..
నా హృదయమందు నీవు కొలువున్నావూ
నా పయన మందు నీవు తోడున్నావూ ||2||
నా జీవం నా గమ్యం నీవెననీ
మనసార నిను నేను ధ్యానింతును ||2|| llనీ వాక్యమేll
2 వ చరణం..
నా బాధలందు నీవు ఓదార్చావు
నా వేధనలందు నీవు దరిచేర్చావు ||2||
యుగయుగములకు నీవె రారాజనీ
ప్రియమార నిను నేను ధ్యానింతును ||2||
నీ వాక్యమే నా జ్వోతియై... ||2||
నను నడిపించును నను నడిపించును నా ప్రాణ యేసువా... ||2||