Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: హల్లెలూయ...హల్లెలూయ
జయ జయగీతం పాడుదము
రక్షణ గీతం పాడుదము
మన ప్రభుయేసు మరణం గెలిచి
మూడవనాడు జీవితుడాయె హల్లెలూయ...
1. నేనే సత్యం నేనే జీవం
నాలో నిలచిన మరణింపరని
పలికిన ప్రభువు జీవితుడాయె
మరణపు ముల్లును భువిలో విరచి ||హ||
2. పాపికి శరణం పుడమికి స్వర్గం
మనిషికి మార్గం శ్రీ యేసు దైవం
మరణము గెలిచెను రక్షకుడేసు
శాంతి విశ్రాంతి వరములొసగగ ||హ||