Type Here to Get Search Results !

జయ జయ ధ్వనులతో ( Jaya jaya dhwanulatho Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


జయ జయ ధ్వనులతో చప్పట్లు కొట్టి

యేసుని మహిమను చాటుదాం 

ఆత్మతో సత్యముతో ఆరాధించి 

ఆర్భాటము చేయుదాం 


హల్లేలూయా హల్లేలూయా 

హల్లేలూయా పాడుచూ 

పూజించి కీర్తించుదాం - జగమంత చాటించుదాం ||2|| 


1. కన్నీటి లోయలో - కష్టాల కడలిలో ||2||

కంటికి రెప్పలా కాచిన - రెక్కల మాటున దాచిన ||2|| 

ప్రభునకే స్తుతి చెల్లించుమా 

చేసిన మేలులు తలంచుమా ||హల్లేలూయా - హల్లేలూయా|| 


2. కలిమి లేములలో బాధలు కలిగిన ||2|| 

క్రుంగనీయక కృపలతో బలపరచి 

ఇలస్థిరపరచినా ||2||

ప్రభునకే స్తుతి చెల్లించుమా

చేసిన మేలులు తలంచుమా.

||హల్లేలూయా - హల్లేలూయా|| 


3. వ్యాధుల వేదనలో- శోధన శోకములో ||2|| 

విశ్వాసములో నడిపిన - నను వెన్నంటి 

నిలిచినా ||2|| 

ప్రభునకే స్తుతి చెల్లించుమా 

చేసిన మేలులు తలంచుమా 

||హల్లేలూయా - హల్లేలూయా|| ||జయ జయ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section