Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ల........ ల......... లలలా.............. లలలల.......
జీవ జలముల నిచ్చును నీ వాక్యం
ప్రాణి కోటికి ప్రాణం నీ వాక్యం
రసరమ్యము మధురాతి మధురం నీ వాక్యం
అల్లెలూయ.......అల్లెలూయ...... ||2||
1 వ చరణం..
నను ఎన్నుకున్న నా బ్రతుకులో
చిగురింప చేయును నీ వాక్యం
సువార్త ప్రకటించుటలో శాంతితో పంపును నీ వాక్యం ||2||
మనసు మనసున ప్రేమతో నింపును నీ వాక్యం ||2||
అల్లెలూయ.......అల్లెూలూయ...... ||2||
2 వ చరణం..
మానవాళికి రక్షణ నియ్యగ భువిపై వెలసెను నీ వాక్యం
నీదు బాటలో పయనింపగా మార్గం చూపును నీ వాక్యం ||2||
మనిషి మనిషిని పరమున చేర్చును నీ వాక్యం ||2||
అల్లెలూయ.....అల్లెలూయ..... ||2||