Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జీవం నిచ్చిన పరమపితా - నీకే స్తుతి ఆరాధన
రక్తం చింది రక్షించిన - యేసుక్రీస్తు ఆరాధన
బలపరచు ..... నను దృఢపరచు
పరిశుద్ధ ఆత్మ ఆరాధన ఆరాధన ....... ఆరాధన ||2||
1 వ చరణం..
నాలో ఉన్న ఊపిరి ........ నీవు ఇచ్చిన కానుక
నాకు ఒసగిన రక్షణ ....... నీవు ఇచ్చిన వరమే
మరువను నిన్ను యేసయ్య ....... మరువను నీదు ప్రేమను
మరువను నిన్ను యేసయ్య ..... మరువను నీదు త్యాగము
జీవించిన మరణించినా - ఇక నీ కోసమే యేసయ్యా
అల్లేలూయ .............. అల్లేలూయా.......... ll 2 ll
2 వ చరణం..
జీవ మొసగు వాక్కుచే - అనుదినం నన్ను పోషించు
నీదు బాటలో పయనింప దారిని నాకు చూపించు చాలును
నాకు నీకృప నిత్యము నేను జీవించెద జీవించిన
మరణించినా - ఇక నీ కోసయే యేసయ్యా
అల్లెలూయా .............. అల్లేలూయా .............. ll 2 ll