Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జాలిని చూపగ రావా -
దారిని చూపగ లేదా
దోషుల దయతో కాచిన దేవా -
పాపుల మమ్ము బ్రోవగ రావా
1. జ్ఞానములోన సంపదలోన -
సలోమోను రాజును దీవించినావే
నీ మాట మరచి నీ బాట విడచిన -
ఆ రాజు దోషము క్షమియించలేదా
2. అజ్ఞానమందున అవివేకమందున -
నీ మంచి గాంచి నీ చెంత చేరిన
నిరుపేదరాలు కడుదీనురాలు
సమరీయ స్త్రీని కరుణించలేదా