Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: జాలి చూపుమా మాపాలి దైవమా
నాదు పాపములు క్షమించి
ప్రేమ చూపుమా - నీ ప్రేమ చూపుమా
1. ధనము ధనమని దానవుడనైతిని
ఘనము ఘనమని గర్విష్టినైతిని ||2||
అంద చందమని నేను అంధుడనైతిని
అనుదినము నిన్ను మరిచిపోతిని ||2||
2. శాంతి శాంతని మనశ్శాంతి లేక
కాంతి కాంతని కనుదృష్టి లేక ||2||
సుఖము సుఖమని సర్వము కోల్పోయి
సున్నము కొట్టిన సమాధివలే నుంటిని