Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జీవమిచ్చెడి వాక్యము యేసు వాక్యము
ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము
వీనుల విందైన వాక్యము మనసులకు
ఆనందము ఆలకించుడి విశ్వసించుడి
అల్లెలూయా అల్లెలూయా అల్లెలూయా అల్లెలూయా
1. మంచి కాపరి నేనే అని అభయమిచ్చిన యేసు వాక్యము
ఆది అంతం నేనే అని ఆదరించిన క్రీస్తు వాక్యము ||వీనుల విందైన||
2. మార్గము సత్యం జీవమని శక్తి ఒసగిన ప్రభుని వాక్యము
ఒకరినొకరు ప్రేమించుడని ఆనతిచ్చిన ప్రేమ వాక్యము ||వీనుల విందైన||