Type Here to Get Search Results !

జీవించుచున్నావన్న పేరు ఉన్నది ( jeevinchuchunavana Peru unnadhi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: జీవించుచున్నావన్న పేరు ఉన్నది

మృతుడవే నీవు మృతుడవే ||2|| 

ఏ స్థితిలో నుండి - పడిపోతివొ నీవు 

జ్ఞాపకము చేసుకొని మారుమనసుపొంది 

ఆ మొదటి క్రియను చేయుము రన్నా ||2|| ||జీవించు|| 


1. చల్లగానైన ఉండు వెచ్చగానైన ఉండు

నులివెచ్చని స్థితి ఏల సోదరా/రీ ||2|| నా నోటి నుండి ఉమ్మి వేయదలచి ఉన్నాను 

యేసు అన్న మాటను మరువబోకుమురన్నా ||జీవించు|| 


2. అన్యాయము చేయువాడు

అన్యాయము చేయనిమ్ము 

పరిశుద్ధుడైన వాడు

పరిశుద్ధుని గుండనిమ్ము 

వానివాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు ||2||

యేసు అన్న మాటను మరువబోకుమురన్నా ||జీవించు|| 


3. ఏ ఘడియో ఏ క్షణమో

ప్రభు రాకడ తెలియదురా 

దొంగవలె వచ్చెదనని అన్నాడు 

గొర్రెపిల్ల రక్తములో తెలుపు చేసుకొనుమా ||2|| 

అంతము వరకు నిలిచి ఉండుమా ||2|| ||జీవించు|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section