Lyrics/Tune: Joseph Kancharla
Music: Naveen M
Album: నీ పదసేవలో-2
సాకి :జీవిత దేవుని కీర్తించ ప్రాణ ప్రియుని ప్రార్థించ
రండి రండి రండి దేవుని సన్నిధికి
ప. రండి ఈ శుభవేళ దేవుని సన్నిధికి
జీవిత దేవుని కీర్తించ ప్రాణ ప్రియుని ప్రార్థించ ||2||
1. ఇద్దరు ముగ్గురు కూడిన చోట
నింపును తన సన్నిధిని ||2||
మనసును మందిరముగ మలచి
మదిలో యేసుని రూపము నిలిపి ||2||
ధూప, దీప ఆరాధనతో - స్తోత్రగీతిక మాలికతో
ప్రభు సన్నిధికి చేరుదము
ప్రభు దీవెనలు పొందుదము ||2|| llరండిll
2. హృదయ ద్వారము చెంతన నిలిచి
పిలుచుచున్నాడు ఘన దేవుడు ||2||
హృదయము తెరచిన ప్రతి వానిలో
వెలిగించును నూతన దీపము
ప్రేమా శాంతి ఆనందముతో
నవ్య జీవిత సౌఖ్యముతో
ప్రభు సన్నిధికి చేరుదము.
ప్రభు దీవెనలు పొందుదము ||2|| ||రండి||