Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జూబిలి గీతం పాడండి
పూజలో పాల్గొన రారండి
ఉత్సవ గీతం పాడండి
దేవుని పూజలు చేయండి
ఉల్లాసముతో ఉత్సాహముతో
కొనియాడెదము ప్రేమతో ||2||
అభినందన-శుభవందన
పూజ్యగురువులకు పుష్పాంజలి ||2||
1. పాతికేళ్ళ జీవితం-దేవుని సేవలో
ధన్యమైన జీవితం-క్రీస్తునిబాటలో ||2||
దైవరాజ్య స్థాపనయే నీ జీవితధ్యేయమై
నవ్యజీవన కాంతియై-చిగురించె ఆత్మలో
ప్రభవించె ధాత్రిలో-శ్రీయేసుని ప్రేమలో
అపురూపమైనది నీ పయనం
ఫలియించె నీ గురు జీవితం ||2||
అభినందన-శుభవందన
పూజ్యగురువులకు పుష్పాంజలి ||2||
2. శాంతిదూత సాక్షిగా-శ్రీసభ సేవలో
సౌమ్యమైన జీవితం-ఆదర్శరీతిలో
రారాజు ప్రేమలో-దివ్య జ్ఞాన బోధలో
సాఫల్య జీవితం-సుమాతృక నీవెగా
గర్వించే ఆదైవం-ఫలియించె నీ స్వప్నం
విరబూసె సేవలు నీ సుగుణం
తరియించె నీ గురు జీవితం ||2||
అభినందన-శుభవందన
పూజ్యగురువులకు పుష్పాంజలి ||2||