Lyrics: Fr. Dusi Devaraj
Tune: Fr. D.V. Prasad
Music: Dattatreya
Album: జీవశృతి - 8
ప. జ్యోతులు వెలిగిన వేళ - పువ్వులు పూసిన వేళ
జీవన పూజా వేళ ప్రభునకు స్వాగత మీయ ||2||
రండీ..రండీ.. అర్చన చేయగ రండి....
రండి రండి...ప్రార్థన చేయగ రండి ||2||
1. ప్రేమ స్వరూపుడు -సద్గుణ శీలుడు
మమతలు పంచిన -స్నేహ స్వరూపుడు
శాంతి సాధనలో-కారుణ్య ధాముడు
సేవాకార్యంలో -త్యాగశీలుడు ||జ్యో||
2. పాప విమోచకుడు-కల్వరి నాధుడు
రక్షణ పోరున-ధీరోధాత్తుడు ||2||
పేదల హృదయంలో -పావన దేవుడు
రోగుల మనస్సులలో-దావీదు పుత్రుడు ||జ్యో||