Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఆ....ఆ......ఆ.... కడరాత్రి భోజనం
ప్రభు శరీర రక్తంఏతెంచి గైకొనరే జనమా ||2||
ఓ నేస్తమా నీ సొలసిన ఆత్మకు
తన జీవ జలధారలతో సేద తీర్చగ
దివినుండి దిగివచ్చిన పరమ పవిత్రాహారం
రారండి స్వీకరించ ఆ స్వర్గపు విందును ||2||
1 వ చరణం..
త్యాగశీలుడు యేసువు తనదైన ఆ దివ్య దేహం
పాప పరిహారార్థమై సిలువలో ఒసగిన విందు
పరిపూర్ణ పరిశుద్ధ విందు
సర్వ జనాళిని ఉద్ధరించు విందు llఓ నేస్తll
2 వ చరణం..
అంధ:కారపు ఆత్మకు కాంతినిచ్చును విందు
మర్ధ్యులైన మనుజులకు జీవమునిచ్చును విందు ||2||
అనురాగ అపురూప విందు
ప్రేమను పంచును ఆ స్వర్గ విందు llఓll
3 వ చరణం..
వినయ శీలుడు యేసువు ప్రేమతో ఒసగిన విందు
శాంతి సమతల స్థాపనకై తానుగ ఒసగిన విందు
ఆనంద దివ్య మర విందు ||2||
అవనిలో వెలసిన ఆ స్వర్గ విందు ||2|| llఓ నేస్తమాll