Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. కడసారి విందు కనుమూయముందు
కారుణ్యమేసింది ఆ కన్నులందు
1. ఎనలేని దారి ఆమోము యందుతనవార్ని
విడిచిపోబోయే ముందు
కడసారి విందు కనుతీరుముందు ||2||
ముఖజ్యోతి వెలిగింది ఆ కన్నులందు
2. శిష్యులు పాదాలు కడిగి
వారి యోగక్షేమాలనడిగి,
ప్రియ శిష్యులందరిని ప్రియమార పిలిచి
ప్రభుమోము పలికెను మనసే విప్పి
నిను వీడి నే పోవు సమయం వచ్చింది
ఇకమీదట ఈ కార్యభారం ||2||
విడువదు ధైర్యం ఇది దైవ కార్యం
చూపండి చూపండి ఆ మోక్షరాజ్యం ||క||
3. ప్రభు మాట వింటేను పగిలింది హృదయం
ప్రతికంట పొంగింది కన్నీటి రుధిరం
ప్రభులేకపోతేను మిగిలింది శూన్యం
ప్రతి గుండె చీల్చింది ఒక ఆత్మ రుణము
కడసారి ఏమింకను తేరుముందు
ముఖజ్యోతి వెలిగింది ఆ కన్నులందు ||క||
4. శిష్యులనోదార్చు ఆ ప్రేమ హస్తం
ప్రభు మోము చూస్తేను కరుణా సముద్రం
ప్రభు వాక్కులో వుంది సకలం సమస్తం
మనసంత వికలం ఆ విందు మాత్రం||క||