Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కనివిని ఎరుగని విందు - కరుణామయుని విందు
జీవము నొసగే విందు - జీవేసుని శుభకర విందు
లోకానరారండి జనులారా - వేగమే రారండి ముదమార
1. కానాపల్లెలో యేసు చేసిన అద్భుతమైన విందు
తల్లి కోరిక తీర్చిన తనయుని దివ్యమైన ఈ విందు
మధురమైన విందు - ఇది మరపురాని విందు ||కనివిని||
2. జీవము నిచ్చి, శక్తినొసగు ప్రభుయేసుని శరీరవిందు
రక్షించి రక్షణ నిచ్చు ప్రభు యేసుని రుధిరపు విందు
ఆరగించ రారండి - ప్రభు యేసుని పొందండి ||కనివిని||