Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సా: కదిలిందీ....కరుణరధం....
సాగిందీ క్షమాయుగం
మనిషికొరకు దైవమే....
కరిగి వెలిగే కాంతిపధం
ప: కదిలింది... కరుణరథం..
సాగింది.. క్షమాయుగం
మనిషి కొరకు దైవమే ||2||
కరిగి వెలిగే కాంతి పధం
కదిలిందీ కరుణ రధం
1. మనుష్యులు చేసిన పాపం
మమతల భుజాన ఒరిగిందీ ||2||
పరిశుద్ధాత్మతో పండిన గర్భం ||2||
వరపుత్రునికై వగచిందీ ||2|| ||కదిలి||
2. దీనజనాళికై దైవకుమారుడు
పంచిన రొట్టెలే రాళైనాయి
పాప క్షమాపణ పొందిన హృదయాలు
నిలువున కరిగి నీరయ్యా యి ||2||
అమ్మలారా నా కోసం ఏడవకండి
మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి
3. ద్వేషం, అసూయ, కార్పణ్యం
ముళ్ళ కిరీటమయ్యింది
ప్రేమ.. సేవ... త్యాగం...
చిలిమీ నెత్తురై ఒలికింది ||2||
4. తాకినంతనే స్వస్థతనొసగిన
తనువుపై కొరడా ఛెళ్ళందీ
అమానుషాన్నీ అడ్డుకోలేనీ
అబలల ప్రాణం అల్లాడిందీ ||2|| ||కదిలి||
5. ప్రేమ పచ్చికల పెంచిన కాపరి
దారుణ హింసకు గురికాగా ||2||
బెదరి పోయిన మూగ గొర్రెలు
చెల్లా చెదురై కుమిలాయి ||2||
6. పరమ వైద్యునిగ పారాడిన పవిత్రపాదాలు
నెత్తురు ముద్దగ మారాయి
అభిషిక్తుని రక్తాభిషేకంలో
ధరణి ద్రవించి ముద్దాడింది ,
7. సిలువను తాకిన కల్వరి రాళ్ళు
కలవరపడి ||3|| అరిచాయి ||3||