Type Here to Get Search Results !

కలసి మెలసి కదలి ( kalasi melasi kadhali Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Gnanam SDB 

Tune: Fr. Gnanam SDB 

Music: Naveen M 

Album: ప్రణతులు -2 


ప. కలసి మెలసి కదలి రారే క్రీస్తుజనులారా

కల్వరి బలి విందు గ్రోలరే 

కతోలికులారా ||2|| 

కరుణామయ వరదానమిదియే 

దైవ ప్రజలారా 

శరణాగత సంరక్షణిదియే 

స్వామి హితులారా ||2|| 

కతోలికులారా క్రీస్తుజనులారా 


1. సత్ప్రసాద స్వరూపములలో

క్రీస్తు దేహము ఆత్మభోజ్యం ||2|| 

నవ్యద్రాక్ష రసము మనకు

క్రీస్తు రక్తము అమర పానం ||క|| 


2. అంధకార ప్రయాణములలో

కాంతి పుంజపు దివ్య భోజ్యం 

పాపమలినపు అంతరాత్మల 

శుద్ధద్రాక్ష మధుర పానం


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section