Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. కూడితిమి ప్రభూ గుడిలో నిను వేడగ
నిన్ను వందించగ నిను సంధించగా
మందసమున బంధిత ప్రభూ
1. వాడిన మా హృదయాలకు
పాడిన నీ ఉపదేశం
జాడ తెలిసి నీ నీడకు వేడుకతో చేరినాము
పాడగ నీ నామమును వేడగ నీ శరణమును
నీడగ నీవున్నావని గాఢమగు కోరికతో
2. మందసములో నుండెడి
ప్రభు నిందలను భరియించి
మా డెందము లలరింపనీవు
వందిత ప్రనాదముతో
బంధితుడైన నిను వందించగా సంధించగా
మంద బుద్దినే వచ్చినాను
మందసమును కదిలిరావా
3. మరణానికి ముందు నీవు ధరను నరుల బ్రోవగ
మరుపురాని గురుతుగా
నరుగున నొక రొట్టెనెత్తి
ఇది నాశరీరమని రక్తమని
రసమును చూపి
పరమ జీవ మొంద
మమ్ము ఆరగించ మంటివి ||క||