Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కళ్యాణం కమనీయం శుభదినం ఈ దినం
ఈ నవ జంటకై జయ మంగళ గీతం
వసంత కోయిల కమ్మని రాగాలు
ఆనంద ఈ వేళ మదిలోని భావాలు
కలసి పాడాయి కళ్యాణ గీతాలు ||కళ్యాణం ||
1. ఈనాటి బంధమూ ఊహించని వాస్తవం
ఈ నాటి పెళ్ళితో మొదలాయె కాపురం
ఆలూమగలుగా కలిసిపోయే తరుణం ||2||
(ఈ) ఇద్దరిని కలిపిన ప్రభు నీకు వందనం ||కళ్యాణం ||
2. ఏకమనసు కలిగీ ఆత్మీయ భావనతో
జీవింప నేర్పుమా శోధనలే రానీక
చేసిన బాసలు నిత్యమూ తలచి ||2||
(ఈ) ఇద్దరిని నడుపుమూ ప్రభు నీకు వందనం
||2|| ||కళ్యాణం ||