Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. కళ్యాణం కమనీయం
ఈ సమయం అతి మధురం ||2||
దేవ రావయ్య - నీ దీవెనలివ్వయ్య ||2||
1. ఏదేను వనమున-యెహోవా దేవ
మొదటి వివాహము చేసితివే
ఈ శుభ దినమున నవదంపతులను
నీ దీవెనలతో-నింపుమయా ||దే||
2. కానా విందులో అక్కర నెరిగి .
నీళ్ళను రసముగా మార్చితివి
కష్టములలో నీవె అండగ నిలచి
ఇల వర్ధిల్లగ చేయుమయా ||దే||
3. బుద్దియు జ్ఞానము సంపదలన్నియు
గుప్తమై యున్నవి నీయందు
ఇహపర సుఖములు మెండుగ నొసగి
ఇల జీవింపగ జేయుమయా ||దే||