Type Here to Get Search Results !

కమ్మని విందు కమనీయ విందు ( kamani vindhu kamaniya vindhu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కమ్మని విందు కమనీయ విందు - 

క్రీస్తు ప్రభుని ఈ విందు 

కల్వరి కొండలో రుధిరము కార్చిన - 

కరుణామయుని కృప విందు 

ఆరగింపరారే ఆత్మ భోజ్యము - 

స్వీకరింప రారే క్రీస్తు దేహము

సకల మానవాళికై వెలసిన విందు -

ఈ కడరా విందు 


1. ఐదు రొట్టెలను రెండు చేపలను -

అద్భుత రీతిగా ఐదువేలమందికి

తృప్తిగ పంచినట్టి క్రీస్తు ప్రభుని ఈ విందు 

పాప భరిత హృదయాలను సేదతీర్చును ఈ విందు-

రక్షణ విందు 


2. అప్పమునందుకొని ఇది నా దేహమని-

రసమును అందుకొని ఇది నా రుధిరమని 

నుడివిన నాధుని నవ్య రుచుల ఈ విందు 

ముదముతోడ లోకొనిన ముక్తినొసగు ఈవిందు-

మహిమల విందు


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section