Type Here to Get Search Results !

కానుక తెచ్చాను అర్పించగ ( kannuka thechannu arpinchaga Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కానుక తెచ్చాను అర్పించగ దేవా - 

ప్రేమతో స్వీకరించు నా దైవమా 


1. పూవులు తేవాలని తోటకి వెళ్ళాను - 

విరివిగా ఉన్నాయి విరిసన కుసుమాలు

కమ్మని సువాసనలు తెమ్మెర మధురిమలు

నీ గుడిలో వుండాలని అడిగి అడిగి వచ్చాయి 


2. ఫలములు తెద్దామని తోటలో వెదికాను

చెట్లమీద వున్న పండ్లు చేర్చు ప్రభుని అన్నాయి

మంచి మంచి ఫలములు మధురమైన ఫలములు 

ఏరికోరి తెచ్చాను నీకే అర్పించాలని


3. శ్రమలతో పండించిన ఫలములే తప్ప - 

నీ ఋణము తీర్చగా ఏమివ్వగలను 

నిర్మల మనస్సును నీతిగల ప్రేమను - 

నీ కొరకై అర్పించెద స్వీకరించు దేవా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section