Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కానుకలు తెచ్చినాము కరుణామూర్తి -
కరుణించి స్వీకరించు ప్రేమమూర్తి
బలిగానిన్నే అర్పించినావు -
బంగారు మనసును ఒసగునాకు
నీ పరిశుద్ద ఆత్మను ఒసగునాకు
అబ్బా శరణం, యేసూ శరణం
ఆత్మా శరణం దేవా శరణం
అర్పించెదను నన్నే బలిగా
అంగీకరించి అభిషేకించు
1. మంచివాడు చెడ్డవాడని చూడకుండ -
వర్షమును ఒసగుతున్న ప్రేమమూర్తి
నీ ప్రేమను గుర్తించగ దేవా! -
బంగారు మనసును ఒసగునాకు
నీ పరిశుద్ద ఆత్మను ఒసగునాకు ||అబ్బా||
2. నిన్ను హింసించిన ప్రజలను కూడా -
కరుణతో చూసినావు ప్రేమమూర్తి
పరుల హృదిలో నేను ప్రభువు నిన్ను కనుగొన -
బంగారు మనసును ఒసగునాకు
నీ పరిశుద్ధ ఆత్మను ఒసగునాకు ||అబ్బా||