Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
1 వ చరణం..
కాంతిని చూపుము దేవా
ద్వాంతా వృతమౌ మార్గానా
నీ జ్యోతి శుభ దీప్తి
మము న్పిును దివ్యపథానా
2 వ చరణం..
గాఢమ్మౌ అంధకారం
మా స్వస్థానం కడుదూరం
నీ తేజో లేశ ప్రసారం
మా గమనమ్మున కాధారం
3 వ చరణం..
దవ్వు నుండు శుభ దృశ్యం
అది చూడగ మే మర్ధించం
అందించుము సాయము లేశం
ఇక పురోగ మింతు మవశ్యం