Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కతోలిక సంఘమా సంఘమా - సంఘమా
కలకాలం అమరపురికి దారి చూపు - సంఘమా
1 వ చరణం..
రక్తదర్పం ఒనరించిన మహానీయుల సంఘం
రక్త సాక్షులెదురు నిలిచి పోరాడిన సంఘం
గగనవీదులందు ఎగురు సిలువ ద్వజ పతాకం
అపవాదితో పోరాడి వేదానికి సాక్ష్యమిచ్చి
ఉడుకు నెత్తురొగబోసి ఉవ్వెత్తున గర్జించిన
ఇదే వేద సంఘం - ఇదే ఆది సంఘం llకతోలికll
2 వ చరణం..
జీవితాలు అంకితమై గురువులుండు సంఘం
త్యాగనిరుతి భరణమై కన్యులుండు సంఘం
కనుపాపగ కాచేటి అమ్మ ఉన్న సంఘం
ఆపదలో అభయమిచ్చి బాధలలో ఓర్పునిచ్చి -
బాధలలో బ్రోచెటి వేదనలో ఆదుకొనే
అమ్మ ఉన్న సంఘం - ఇదే తల్లి సంఘం llకతోll
3 వ చరణం..
గర్జించు సింహ మెదురైనా పొంచి ఉన్న బొబ్బులైనా
శోధనలు ఎదురైనా కాలం స్తంభించినా భూగోళం బ్రద్దలైనా
సృష్టి తునాతుకలైనా విజయభేరి మ్రోగించే
నిలకడగల సంఘం నిలకడ గల సంఘం llకతోలికll