Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
క్షణికమైన బ్రతుకుపైన తపన ఎందుకు
నాది నాది నాదని వాదనెందుకు వేదనెందుకు
ఏది నీది కాదుగా నిఖిలమందున-
నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా
1. కులము బలము ధనము ఘనము ఏది నికరము
అంద చంద బంధు వర్గ మేది నిలుచును
కాని దాని కొరకు నీవు కాలు దువ్వుచు -
కలసి రాలేదని కలత చెందకు
2. నిత్యమైన రాజ్యమొకటి ఉంది తెలుసుకో
సత్యమైన పాలన జరుగునచ్చట -
యేసు క్రీస్తు ఎల్లవేళ రాజ్యమేలగా
నిత్య న్యాయమెప్పుడు నిలిచియుండును