Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
1. క్రైస్తవ మిత్రమా - ప్రీతితో విను నా మాట -
శాశ్వతం కాదు ఈ జీవితము
హా నేడు ఉంటావో రేపు వుంటావో -
లేక మంటికి మేత యగుదువో
2. యవ్వన ప్రాయమా నవ్వుల కాలమా -
ఎల్లప్పుడిట్లుండవు సుమా
హా కాలం మారిపోగా కష్టాలు రాగా
కను దృష్టిపోయి కదలకయుండి -
గతియించి పోయెదవు
3. సొగసైన ముఖముతోను సొంపైన నడకతోను
ఇంపైన మాటలతో తిరిగెదవా హా
ఓ నా యిష్టుడా నీ షోకు ఎంతసేపు -
నీ సొగసు ఎంతసేపు నీ యిషరు ఎంతసేపు
4. ఎక్కడ చచ్చెదవో ఎప్పుడు చచ్చెదవో
ఎన్నడును ఎరుగ లేవు హా
ఎక్కడుండిన, ఎట్లు బ్రతికిన ఎంత ఏడ్చిన -
ఏమి చేసిన చావు తప్పదు
5. చచ్చిన పిదప నీవు సంపాదించినవన్నీ -
సుఖించు వాడెవ్వడూ సఖుడా
హా! నీ ఇల్లు వాకిలి తల్లి దండ్రులు బంధుమిత్రులు -
అందరిని వదలి వెళ్ళిపోయెదవు
6. ఓరే! ఓలే! యని ఒయ్యార గర్వముతో -
తల్లిని తండ్రిని పిలువకుమా హా
వెర్రివాడా నీ తల్లి దండ్రులకు నీ వెట్లు చేసెదవో -
నీ పిల్లలు నీకు అట్లే చేసెదరు
7. ఓరీ! పాపాత్ముడా ఓరీ! పామరుడా -
చావుకు తరువాత కఠిన తీర్పు, హా
నీవు దూషించిన త్రోసివేసిన ద్వేషించిన -
యేసు నాథుడే తీర్పు చేసెదరు