Type Here to Get Search Results !

కొంతసేపు కనబడి ( konthasrpu kanabadi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కొంతసేపు కనబడి - 

అంతలోనే మాయమయ్యే 

ఆవిరి వంటిదిరా ఈ జీవితం - 

లోకాన కాదేది శాశ్వతం

యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు - 

మరణమైన జీవమైన నిన్ను విడువడు


1. ఎదురౌతారెందరో నీ పయనంలో - 

నిలిచేది ఎందరో నీ అక్కరలో 

వచ్చేదెవరు నీతో మరణం వరకు - 

ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము నీకు


2. చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోర్చి -

ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా

ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే - 

సంపాదన ఎవరిదగునో యోచించితివా 


3. నీ శాపం తాను మోసి పాపం తీసి - 

రక్షణ భాగ్యము నీకై సిద్దము చేసి 

విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా - 

నిర్లక్ష్యము చేసి తప్పించుకొందువా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section