Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ష కన్నుల్లోని కన్నీటిని తుడుచుకోవమ్మా
సువార్తను స్వీకరించమ్మా
భారమైన సిలువను మోసిన ప్రభువే
నీతో వుండ వచ్చి యున్నారమ్మా
ఎంతో ఆనందం ఎంతో సంతోషం
ప్రభువే నీతో స్వయముగా
నడచుచున్నారమ్మా
1. తోడు ఎవరు లేరని బాధవున్నదా
నమ్మిన వారే నిన్ను విడిచి పోయారా
పర్వతములు యెరుషలేమును చుట్టినట్టుగా
కంచె వేసి నిన్ను కావ ప్రభువున్నారమ్మా
ఎంతో ఆనందం ఎంతో సంతోషం
ప్రభువే నీతో స్వయముగా ,
నడుచుచున్నారమ్మా.. . ||క||
2. పేదగా వున్నానని వేదనున్నదా :
వుండి కూడ పేద హృదిలో ...
కుములుచున్నావా
పేదలను ధనికులుగా మార్చిన ప్రభువు
తన ఐశ్వర్యముతో -
నీ అవసరములు తీర్చును ||క||