Type Here to Get Search Results !

కన్య గర్భమందు బుట్టి ( kanya garbhamandhu bhutti Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. కన్య గర్భమందు బుట్టి 

చిన్న బాలుడై యున్నట్టి 

కన్య పుత్రానిన్నే నమ్మితి

ఓ, ఓ, బాలస్వామి

కన్నులెత్తి మమ్ము జూడుము ||క|| 


1. మింట నుండి నీవు వచ్చి

మంటిపైన జనన మొంది

మొండిగాను బండ గాడిలో 

ఓ, ఓ, బాలస్వామి

జంట లేని మేటి బాలుడవు ||క|| 


2. చెడుగు రాళ్ళ పూజలనేడు

మడుగులోనే మునిగి మునిగి

కడను గానక భ్రమసి యుంటిమి 

ఓ, ఓ, బాలస్వామి

కడన నిన్నే తెలిసి కొంటిమి ||క|| 


3. తుంటరితనము కలిగి జనులు

తంట జేసి తిరిగెదరయ్యా 

అంటినట్టి లోకమాయచే 

ఓ, ఓ, బాలస్వామి

అంటు బాపి బంట్ల జేయుము ||క|| 


4. పాపము బోనడచి మమ్ము

పాలించెడి బాలుడవు 

కాపాడి కరుణ నేలుము 

ఓ, ఓ, బాలస్వామి

కనికరమున బుద్ధిచెప్పుము ||క|| 


5. భూములేల బుట్టి కలుష '

భూజముల నెల్లగోట్టు 

స్వామిపైన దెరుగ జాలరు 

ఓ, ఓ, బాలస్వామి

సర్వ జనుల గర్వమొందరు ||క|| 


6. ఇంపుగను ఇహపరముల

నేలుచున్న మరియ తనయా 

సొంపగు నీ ప్రాపు గోరితీ 

ఓ, ఓ బాలస్వామి 

తెంపు గరిగి మమ్ము జూడుము ||క|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section