Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కన్య మరియ మిమ్మునేను కానీ నుతింప గోరినాను
అన్య మెరుగనమ్మ – నన్నాదరింపవే
1. ఇలను జనుల వలని ప్రేమ – వలదు సుందరాంగి నీదు
సలలితా దరణము గోరి – సంచరింతునుll కన్య ll
2. మిమ్ము గూర్చి వినుతి చేయు-మితియు మేరలేని జనులు
వమ్ము దీర్ప కర్త వేడు – వరగు ణాడ్యపు ll కన్య ll
3. కోటి సూర్య ప్రకాశ – కోమలాంగి దేవమాత
మాటికిని వరేశుతోడ – మందలింప వే ll కన్య ll