Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. కాపరి మంచి కాపరి మన ప్రభువే ఆ కాపరి
పచ్చిక బయళ్ళలో మేపుచు
జీవజలము మనకిచ్చు కాపరి
1. దారి తప్పిన గొర్రెల - దాపున వుండే కాపరి
నశించువారిని వెదకుచు-రక్షణ నిచ్చె కాపరి
తన మందకొరకు తన ప్రాణమును
అర్పించును కాపరి
ఆది అంత్యములు లేని కాపరి
యుగాంతములకు ఆయనే కాపరి ||రా||
2. కన్య సుతునిగా వచ్చిన కరుణకు
నిలయుడీ కాపరి కారణజన్ముడు ఈ కాపరి
కాలపూర్తిలో వచ్చిన కాపరి
తన మందకొరకు తన
ప్రాణమును అర్పించిన కాపరి
ఆది అంత్యములు లేని కాపరి
యుగాంతములకు ఆయనే కాపరి ||రా||