Type Here to Get Search Results !

క్రీస్తేసు విందు ( kristhu vindhu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: క్రీస్తు జయంతి కానుక-06 


ప. క్రీస్తేసువిందు క్రీస్మస్ విందు 

జనులెల్లరకును స్థిర జీవవిందు 

మదిదోచే హృదిదాచే 

పరమాత్మపు ప్రభువిందు

మనసారా దరిచేర ఇట త్వరపడిరారండి 


1. యావే నాడు ఆదరించెను

మన్నా భోజ్యం ఒసగి కాపాడెను 

యేసు నేడు జన్మించెను భువిలో 

నరరూపం దాల్చి రక్షించెను 

మాతృత్వ మీ విందు మనుజాళికి విందు 

దావీదు సుతుడేసు దయచేయు ఈ విందు

భుజియింప రారండి విభుడిచ్చు విందిదియే ||మ|| 


2. ఇలలో కన్యక విధేయించెను

తనలో దివ్య దేవుని జననం ఆహ్వానించెను

గగనం భువనం కీర్తించెను 

స్తుతులు మహాఘనతయు 

మహిమలు చేకూర్చెను 

దివినేలు రారాజు దైవత్వమీ విందు

భువినేలు మహారాజు సుగుణాల ఈ విందు 

ఆనందమీ విందు ఆధ్యంతమీ విందు ||మ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section