Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
క్రీస్తుని దేహమా మా జీవాహారమా -
క్రీస్తుని రక్తమా మా జీవన పానమా ||2||
లోకాన రారే ఓ దైవ జనమా ఏసుని విందుకు
ఓఓ... పరుగులు తీరే
మహిమను పొంద ఆ ప్రేమ విందుకు ||క్రీస్తుని||
1. దీనాత్ముల ధన్యత విందు -
పాపాత్ముల రక్షణ విందు
అలసి సొలసిన వారలకు సేద తీర్చు ఈవిందు ||2||
లోకాన రారే ఓ దైవ జనమా ||2||
దివ్యమైన ఈ విందు స్వీకరించరారే ||క్రీస్తుని||
2. పరమాత్ముని ఔషధ విందు -
సకలాత్మల విముక్తి విందు
శోధనలో బాధలలో స్వస్థపరచు ఈ విందు ||లోకాన||